Khairatabad: కాంగ్రెస్ పాలనలో నిధుల్లేవు.. అభివృద్ధే లేదు: బీఆర్ఎస్!
Khairatabad: అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు అందకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
Khairatabad: కాంగ్రెస్ పాలనలో నిధుల్లేవు.. అభివృద్ధే లేదు: బీఆర్ఎస్!
ఖైరతాబాద్: బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడిన ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనను గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరవాలి.
అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తానని అంటున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. నిన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తే, నేడు రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధులు అందక, అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? బిల్లులు లేవు.. నిధులు లేవు.. అభివృద్ధి లేదు.. ఇదేనా కాంగ్రెస్ మార్క్ పాలన? ఎమ్మెల్యేలకే నిధులు కేటాయించలేని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారు?
అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ప్రజలకు కనిపించే అభివృద్ధి ఎక్కడా లేదు. ఒకవైపు రైతులు సమస్యలతో సతమతమవుతుంటే, మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా న్యాయం జరగడం లేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు రోజురోజుకూ బయటపడుతున్నాయని మన్నె గోవర్ధన్ రెడ్డి గారు విమర్శించారు.




