Kukatpally: కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్!
Kukatpally:కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో జూపల్లి సత్యనారాయణ, గులాబీ శ్రేణులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
Kukatpally: కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా దీక్షా దివస్!
Kukatpally: ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి మాజీ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, నాయనేని తులసిరావు, ఆనంద్ రావుతో పాటు గులాబీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి నిరాహార దీక్ష చేపట్టారని నాయకులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా, ఇంటింటికీ తాగునీరు అందించే కార్యక్రమాలను అమలు చేసిందని తెలిపారు.
సాధించిన తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో నీరు, విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గులాబీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.




