Ghatkesar: ఘట్‌కేసర్‌లో యువతి ఆత్మహత్య కేసులో ప్రియుడు అరెస్ట్, రిమాండ్!
Ghatkesar: ఘట్‌కేసర్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో పెళ్లికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడు జామ కిరణ్‌కుమార్‌ను శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Ghatkesar: ఘట్‌కేసర్‌లో యువతి ఆత్మహత్య కేసులో ప్రియుడు అరెస్ట్, రిమాండ్!
ఘట్‌కేసర్: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరకు వివాహానికి నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితుడైన ప్రియుడు జామ కిరణ్‌కుమార్‌ను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్‌కేసర్ ఎన్‌ఎఫ్‌సీ నగర్‌కు చెందిన ఐశ్వర్య (22) ఈ నెల 18న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 19న మృతి చెందింది.
తన కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చివరకు వివాహానికి నిరాకరించడంతో మానసిక వేదనకు గురై ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి దర్నబోయిన జంగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఐశ్వర్య, కిరణ్‌కుమార్ మధ్య ఉన్న ప్రేమ సంబంధం, వివాహ ప్రతిపాదనకు సంబంధించిన వివాదంపై ఆధారాలు సేకరించారు.
వాటి ఆధారంగా కిరణ్‌కుమార్‌ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ తెలిపారు.




