Bowenpally: బోయిన్‌పల్లి లారీ అడ్డా వద్ద ఘనంగా వినాయక అన్నదానం

Bowenpally: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి లారీ అడ్డా విఘ్నేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు.

Srikanth, Secunderabad
Published on: 21 Sept 2026 3:02 PM IST
Bowenpally
X

Bowenpally: బోయిన్‌పల్లి లారీ అడ్డా వద్ద ఘనంగా వినాయక అన్నదానం

సికింద్రాబాద్: వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా బోయిన్పల్లి లారీ అడ్డ విగ్నేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు నాయకులు భారీ ఎత్తున పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు ఆ విజ్ఞరాజుని ప్రజలందరి సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రాజిరెడ్డి 44, నందన్ యాదవ్, సామల బాల్రెడ్డి, మిట్టు, ఎంకబాబు ,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad