Cherlapally: రెడ్డి కాలనీలో కోలాహలంగా బతుకమ్మ వేడుకలు!
Cherlapally: చర్లపల్లి రెడ్డి కాలనీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొని మహిళలతో కలిసి ఆడి శుభాకాంక్షలు తెలిపారు.
Cherlapally: రెడ్డి కాలనీలో కోలాహలంగా బతుకమ్మ వేడుకలు!
Cherlapally: చర్లపల్లి డివిజన్లోని రెడ్డి కాలనీలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి, ఆడపడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




