Boduppal: ప్రశాంత్ నగర్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ.. పోటెత్తిన మహిళలు

Boduppal: బోడుప్పల్ సర్కిల్ చెంగిచర్ల డివిజన్ ప్రశాంత్ నగర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. డాక్టర్ సారిత, తోటకూర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL
Published on: 18 Oct 2026 11:56 PM IST
Boduppal
X

Boduppal: ప్రశాంత్ నగర్‌లో వైభవంగా సద్దుల బతుకమ్మ.. పోటెత్తిన మహిళలు

బోడుప్పల్‌: తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్‌ ప్రశాంత్‌ నగర్‌ కాలనీలో ఆదివారం ఘనంగా జరిగాయి.

కాలనీ మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ పాటలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ వేడుకల్లో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్‌ యాదవ్‌ కుమార్తె డాక్టర్‌ సారిత, మాజీ సర్పంచ్‌ తోటకూర లక్ష్మీ యాదవ్‌, ఆమె కోడళ్లు, మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌ యాదవ్‌ సతీమణి స్పందన యాదవ్‌, పవిత్ర తదితరులు పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, తరతరాలుగా వస్తున్న ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా ఆనందాన్ని నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL