Boduppal: చెంగిచెర్లలో రూ.80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

Boduppal: బోడుప్పల్ సర్కిల్ చెంగిచెర్ల డివిజన్‌లోని పలు కాలనీల్లో రూ.80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ ప్రారంభించారు.

KARUNAKAR, UPPAL
Published on: 13 Nov 2026 2:04 PM IST
Boduppal
X

Boduppal: చెంగిచెర్లలో రూ.80 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

బోడుప్పల్‌: కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ బోడుప్పల్‌ మాజీ మేయర్‌ తోటకూర అజయ్‌ యాదవ్‌ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి నగరపాలక సంస్థ బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని చెంగిచెర్ల డివిజన్‌లో రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

ద్వారకానగర్‌ కాలనీ ఫేజ్‌-1, ఫేజ్‌-2తో పాటు నందిని నగర్‌ కాలనీల్లో ఈ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా అజయ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. కాలనీల్లో రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ప్రజల దైనందిన అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతులను మెరుగుపర్చడమే లక్ష్యంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలని, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్‌ గౌడ్‌, మాజీ కార్పొరేటర్‌ బింగి జంగయ్య యాదవ్‌, కుర్రి శివశంకర్‌, రసాల కుమార్‌ యాదవ్‌, కొత్త సుశాంత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL