Hyderabad: భారత్ సమ్మిట్ వివాదం.. FRROకు ఫిర్యాదు చేసిన బీజేపీ అధ్యక్షుడు!

Hyderabad: భారత్ సమ్మిట్-2026 వేదికగా విదేశీ రాజకీయ ప్రముఖులు చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు శంషాబాద్ FRROకు ఫిర్యాదు చేశారు.

ANJAIAH, SHAMSHABAD
Published on: 16 Nov 2026 1:16 PM IST
Hyderabad
X

Hyderabad: భారత్ సమ్మిట్ వివాదం.. FRROకు ఫిర్యాదు చేసిన బీజేపీ అధ్యక్షుడు!

Hyderabad: భారత్ సమ్మిట్‌–2026 వేదికగా విదేశీ రాజకీయ ప్రముఖులు చేసినట్లు ఆరోపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పందించారు.

ఈ మేరకు సోమవారం శంషాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ OCR కాంప్లెక్స్‌లో ఉన్న ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (FRRO) కార్యాలయానికి బీజేపీ లీగల్ టీమ్‌తో కలిసి చేరుకున్న రామచందర్ రావు, విదేశీ రాజకీయ ప్రతినిధుల వ్యాఖ్యలపై అధికారులకు ఫిర్యాదు అందజేశారు.

భారత్ సమ్మిట్ వేదికగా చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, దేశ ప్రయోజనాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ లీగల్ టీమ్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD