Medchal: మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!
Medchal: మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం శ్రీరాముడు, శివుడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆందోళన హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్.
Medchal: మేడ్చల్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!
మేడ్చల్: మేడ్చల్ డివిజన్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో శ్రీరాముడు, శివుడిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
శ్రీరాముడు ధనవంతులకు, శివుడు పేదలకు సంబంధించిన దేవుడిగా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ దేవుళ్లను, హిందువుల విశ్వాసాలను వివాదంలోకి తీసుకురావడం తగదని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.




