Talakondapalli: తలకొండపల్లి పర్యటించిన బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారి!
Talakondapalli: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో వివిధ కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారి పాల్గొని సందడి చేశారు.
Talakondapalli: తలకొండపల్లి పర్యటించిన బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారి!
Talakondapalli: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని వివిధ కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ నేత తల్లోజు ఆచారి ఆదివారం పాల్గొన్నారు. వెల్జాల్ గ్రామంలో అబ్బాస్ నూతన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెల్జాల్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు సాధిక్ అలీ మాతృమూర్తి మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మిడ్జిల్‌లో వెల్జాల్ గ్రామానికి చెందిన వసంత స్వామి యాదవ్ దంపతుల చిన్నారుల పుట్టు పంచల కార్యక్రమంలో పాల్గొన్న తల్లోజు ఆచారి, చిన్నారులను ఆశీర్వదించారు. అలాగే జిల్లా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పెరుమాళ్ల రాజును శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠం పాండు, గట్టు ఇప్పలపల్లి సర్పంచ్ జీనుకుంట్ల చంద్రశేఖర్, దళిత మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాజు, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, వెంకటయ్య, హరికాంత్, బాలకృష్ణ, ఆరిఫ్, శ్రీశైలం యాదవ్, నర్సింహ, రాఘవేందర్, గౌడ్, నాయక్, రవి తదితరులతో పాటు యాదవ సంఘం నాయకులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




