Hayathnagar: రంగనాయకుల గుట్ట అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ నాయకులు!

Hayathnagar: హయత్‌నగర్ రంగనాయకుల గుట్టలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని బీజేపీ జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాయకులు సందర్శించి వసతులపై ఆరా తీశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 6 Oct 2026 7:15 PM IST
Hayathnagar
X

Hayathnagar: రంగనాయకుల గుట్ట అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ నాయకులు!

హయత్‌నగర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హయత్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు గంగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రంగనాయకుల గుట్టలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తదితరులు అంగన్వాడీ కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్య, ఆరోగ్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలపై అంగన్వాడీ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నాయకులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు చిన్నారుల ప్రాథమిక అభివృద్ధికి కీలకమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేయడమే బీజేపీ నాయకుల లక్ష్యమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డి, నాయకులు పార్వతి, గోవింద చారి, జంజ్య నాయక్, మొగులయ్య, శ్రీకాంత్, బీజేవైఎం నాయకులు అభిలాష్, రీతిక్‌తో పాటు పార్టీ కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR