Maheshwaram: వాటర్ ట్యాంకుల స్థలాన్ని పరిరక్షించాలి..ప్రజావాణిలో బీజేపీ నిరసన!
Maheshwaram: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో తాగునీటి ట్యాంకుల స్థలాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ప్రజావాణిలో నిరసన తెలిపారు.
Maheshwaram: వాటర్ ట్యాంకుల స్థలాన్ని పరిరక్షించాలి..ప్రజావాణిలో బీజేపీ నిరసన!
Maheshwaram: మహేశ్వరం గ్రామంలోని ప్రజల మంచినీటి వాటర్ ట్యాంకుల స్థలానికి సంబంధించిన వివాదాన్ని వెంటనే పరిష్కరించి, స్థలాన్ని పరిరక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.
వాటర్ ట్యాంకుల స్థల వివాదంపై గత మూడు నెలలుగా సమస్య కొనసాగుతున్నప్పటికీ, బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుపై 15 రోజులుగా స్పందన లేకపోవడంతో ప్రజావాణిలో నిరసన చేపట్టారు. వాటర్ ట్యాంకుల స్థలానికి సంబంధించిన ప్రహరీ గోడపై ‘కబ్రస్తాన్’ అని రాసిన వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గ్రామ ప్రజలకు తాగునీరు అందించే వాటర్ ట్యాంకులు, వాటి స్థలాన్ని కాపాడాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్‌పై కూడా ఉందని, ఈ విషయంలో సర్పంచ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బీజేపీ నాయకులు కోరారు.
సర్వే నంబర్ 336కు సంబంధించిన పత్రాలు, హద్దులను పూర్తిస్థాయిలో పరిశీలించి సమస్యను చట్టప్రకారం పరిష్కరించాలని అధికారులను కోరారు. దీనిపై ఎంఆర్ఓ స్పందిస్తూ రేపటిలోపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు తమ నిరసనను విరమించారు.
ఈ కార్యక్రమం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్ ఆధ్వర్యంలో జరిగింది. బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి పాండు నాయక్, సీనియర్ నాయకులు తింగరికారి నాగేశ్వర్ ప్రకాష్, ఆదిల్ల కుశలయ్య, మండల కార్యదర్శి మహేందర్, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు చిందం జంగయ్యతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గ్రామ ప్రజల తాగునీటి అవసరాలకు సంబంధించిన వాటర్ ట్యాంకుల స్థలంతో పాటు, గ్రామానికి చెందిన ప్రభుత్వ ఆస్తులను కూడా పరిరక్షించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు.




