Tarnaka: తార్నాకలో 'సేవా పక్వాడ' - ఘనంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం!
Tarnaka: సేవా పక్వాడలో భాగంగా తార్నాక నాగార్జున నగర్‌లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు మాదల రాధాకృష్ణ తదితరులు.
Tarnaka: తార్నాకలో 'సేవా పక్వాడ' - ఘనంగా పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం!
Tarnaka: సేవా పక్వాడలో భాగంగా బీజేపీ నాయకులు మాదల రాధాకృష్ణ ఆధ్వర్యంలో తార్నాక లోని నాగార్జున నగర్ లో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుండి మహాత్మా గాంధీ, జయంతి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా 15 రోజుల నిర్వహించే సేవా పఖ్వాడా కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
పరిసరాల పరిశుభ్రతతోపాటు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటడం, నీటి వనరులను శుభ్రంగా ఉంచడం, స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన సమాజాన్ని నిర్మించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తార్నాక బిజెపి అధ్యక్షుడు కరుణాకర్, బీజేపీ నాయకులు శ్రీరామ్ వెంకట్, కృష్ణ గౌడ్, అనూష, దేవా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




