Jubilee Hills: రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది కీర్తిరెడ్డి!

Jubilee Hills: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జూటూరు కీర్తిరెడ్డి మండిపాటు. యువ పారిశ్రామికవేత్త ఆరోపణలపై సమగ్ర విచారణకు డిమాండ్.

RAJESH,	WEST ZONE
Published on: 22 Sept 2026 8:52 AM IST
Jubilee Hills
X

Jubilee Hills: రేవంత్ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది కీర్తిరెడ్డి!

Jubilee Hills: కాంగ్రెస్ పాల‌న‌తో తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోతోంద‌న్నారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి. తాజాగా యువ పారిశ్రామికవేత్త కె. శోభారెడ్డి ఓ వ్యక్తిపై చేసిన వేధింపుల ఆరోపణలను తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని స్ప‌ష్టం చేశారామె. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.

తన వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో, ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా చెప్పుకున్న వ్యక్తి గెస్ట్‌హౌస్‌కు రావాలని కోరినట్లు శోభారెడ్డి సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేసిన విషయమై ఆమె స్పందించారు. రేవంత్ చెప్పుకుంటున్న ప్ర‌జా పాల‌న అంటే ఇదేనా అని నిల‌దీశారు. “తన వ్యాపారం కోసంముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కోరడమే ఒక మహిళ చేసిన తప్పా? అన్న కీర్తిరెడ్డి.. ఆ మహిళ తనకు ఎదురైన అనుభవాన్ని బహిరంగంగా చెప్పుకునే పరిస్థితి కూడా లేకపోతే.. ఇక రాష్ట్రంలో సామాన్య మహిళ పరిస్థితి ఏమిటి?” అని కీర్తిరెడ్డి ప్రశ్నించారు.

మౌనం స‌మాధానం కాదు.. సీఎం గారూ.

మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు తమ ప్రతిభతో ముందుకు రావాల్సిన సమయంలో రాజకీయ పరిచయాలు, అధికార ప్రభావం, మధ్యవర్తుల వ్యవహారాలపై ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. శోభారెడ్డి చేస్తున్న ఆరోపణలపై సీఎంగా, హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి మౌనంగా ఉండ‌టం స‌రికాద‌న్నారు. మహిళా భద్రత అనేది రాజకీయాలకు అతీతమైన అంశమన్న ఆమె.. ఈ విష‌యంలో ఏ పార్టీకి చెందిన వ్యక్తిపై ఆరోపణలు వచ్చినా నిష్పక్షపాతంగా విచార‌ణ జ‌ర‌గాల‌న్నారు కీర్తిరెడ్డి.

న్యాయం జరిగే వరకు అండగా

సాటి మహిళకు న్యాయం జరిగే వరకు బీజేపీ అండగా ఉంటుందని కీర్తిరెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి, అవసరమైన విచారణ మరియు చట్టపరమైన చర్యలు చేపట్టే వరకు ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కీర్తిరెడ్డి.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE