Hyderabad: డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
Hyderabad: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి నషా ముక్త్ భారత్ నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బీజేపీ నేత జూటూరు కీర్తిరెడ్డి పిలుపునిచ్చారు.
Hyderabad: డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి!
Hyderabad: డ్రగ్స్ మహమ్మారిని అరికట్టి, నషా ముక్త్ భారత్ నిర్మించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘సిటీ కన్వెన్షన్ ఆన్ డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
యువత దేశానికి తరగని ఆస్తి అని, డ్రగ్స్ మాఫియా యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వ్యాప్తికి పాల్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ డ్రగ్స్‌పై సంఘటితంగా పోరాడాలని కోరారు.
ఈ నెల 25, 26, 27 తేదీల్లో అంబర్‌పేట నుంచి జూబ్లీహిల్స్ వరకు నిర్వహించనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ ర్యాలీలో యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కీర్తిరెడ్డి విజ్ఞప్తి చేశారు.




