Hyderabad: టీమ్ సాయిపై పెట్టిన కేసు వెనక్కి తగ్గేదే లేదు బీజేపీ పద్మిని
Hyderabad: టీమ్ సాయిపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ పద్మిని స్పష్టం చేశారు.
Hyderabad: టీమ్ సాయిపై పెట్టిన కేసు వెనక్కి తగ్గేదే లేదు బీజేపీ పద్మిని
హైదరాబాద్: బిజెపి మాజీ కోశాధికారి సాయి ప్రసాద్ అలియాస్ టీమ్ సాయి పై తాను పెట్టిన కేసును ప్రాణం పోయినా వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని, అదే పార్టీ తెలంగాణ సోషల్ మీడియా కన్వీనర్ పద్మిని స్పష్టం చేశారు.
విషయంలో ఇతర పార్టీల ఒత్తిడీ తనపై లేదని, ఇతర పార్టీలకు అమ్ముడు పోయే చరిత్ర సాయి ప్రసాద్ కు ఉందని, గతంలో సాయి ప్రసాద్ ఇతర పార్టీల నుంచి డబ్బులు తీసుకుని పార్టీ ఓటమికి కారణం అయ్యారని, సాయి ప్రసాద్ తీరుపై పార్టీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు ఆమె వివరించారు.
అధిస్థానం విచారణ చేస్తోందని, అయితే ఇది పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. పైసలకు అమ్ముడుపోయే దానిగా తనను చిత్రీకరిస్తూ పైసలు ఇవ్వడం ఆపడం వల్లనే తాను సాయి ప్రసాద్ పై కేసు పెట్టినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పద్మిని మీడియా కు వివరించారు.
ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఐతే తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని తీవ్రంగా వత్తిడి తెస్తున్నట్లు పద్మిని మీడియా సమావేశంలో వివరించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారాలు చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నట్లు ఆమె ఆరోపించారు. సాయి ప్రసాద్ కు తనకు మధ్య పోరు వ్యక్తిగతం తప్పా బిజెపికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. నేను బీజేపీలో ఇప్పటికీ ఆక్టివ్ గా పని చేస్తున్నానని పద్మిని అన్నారు.




