Nacharam: నాచారంలో ఘనంగా ఆశీర్వాద దీపోత్సవం!

Nacharam: ప్రధాని మోదీ 76వ జన్మదినం సందర్భంగా నాచారంలో ఆశీర్వాద దీపోత్సవం. పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్.

HARISH, TARNAKA
Published on: 18 Sept 2026 9:21 AM IST
Nacharam
X

Nacharam: నాచారంలో ఘనంగా ఆశీర్వాద దీపోత్సవం!

Nacharam: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా నాచారంలో ఆశీర్వాద దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ దీపాలు వెలిగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాజరై దీపాలను వెలిగించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, వారికి చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో దేశసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో భారత్ ‘వికసిత భారత్’ దిశగా ఆత్మవిశ్వాసంతో పయనిస్తోందన్నారు.

అభివృద్ధి, సాధికారత, ‘సబ్‌కా సాథ్–సబ్‌కా వికాస్’ స్ఫూర్తితో దేశం ప్రగతి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ మోదీ నాయకత్వంలో భారతదేశం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా రవి నాయక్ ఆకాంక్షించారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA