Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి బీసీఎస్ఎఫ్!

Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ కేటాయించాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద బీసీ విద్యార్థి సంఘాల నిరసన ప్రదర్శన.

HARISH, TARNAKA
Published on: 1 Oct 2026 5:32 PM IST
Hyderabad
X

Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు ప్రాతినిధ్యం ఇవ్వాలి బీసీఎస్ఎఫ్!

Hyderabad: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని బీసీ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (BCSF) డిమాండ్‌ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో వివిధ బీసీ విద్యార్థి సంఘాలు, పరిశోధక విద్యార్థులతో కలిసి నిరసన నిర్వహించచారు.

ఈ సందర్భంగా బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదులు యాదవ్‌ మాట్లాడుతూ.. బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజకీయ ప్రాతినిధ్యం విషయంలో మాత్రం జాప్యం చేస్తోందని ఆరోపించారు. బీసీ కులగణన చేపట్టామని చెబుతున్న ప్రభుత్వం రాజకీయంగా 42 శాతం రిజర్వేషన్ల అమలుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఒక స్థానాన్ని బీసీలకు కేటాయించాలని కోరారు. బీసీలకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వకపోతే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఓడించేందుకు ఐక్యంగా పనిచేస్తామని హెచ్చరించారు. బీసీ ప్రజాప్రతినిధులు, మేధావులు, విద్యార్థులు ఈ అంశంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో AIOBCSA నాయకుడు మహేష్‌గౌడ్‌, న్యాయవాది శ్రవణ్‌ యాదవ్‌, MSF జాతీయ ఉపాధ్యక్షుడు తోకల చిరంజీవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూక మధు యాదవ్‌, JVS రాష్ట్ర అధ్యక్షుడు చీరాల వంశీ, రజక విద్యార్థి సంఘం నాయకులు వంశీ, రఘు, ఓయూ విద్యార్థి నాయకులు సాయికిరణ్‌, చిందం మధుయాదవ్‌, ప్రవీణ్‌, మనోజ్‌, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA