Masab Tank: మాసబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ వద్ద బీసీ సంఘాల మహాధర్నా!

Masab Tank: రాష్ట్రంలో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని మాసబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ వద్ద బీసీ సంఘాల ధర్నా. హాజరైన ఎంపీ ఆర్. కృష్ణయ్య.

GIRI, CENTRAL ZONE
Published on: 22 Sept 2026 6:27 PM IST
Masab Tank
X

Masab Tank: మాసబ్ ట్యాంక్ డీఎస్ఎస్ భవన్ వద్ద బీసీ సంఘాల మహాధర్నా!

Masab Tank: రాష్ట్రంలో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలి, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ డి ఎస్ ఎస్ భవన్ ముందు ధర్నా. ధర్నాకు హాజరైన రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. బిసి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్..బిసి విద్యార్థి సంఘాల నేతలు

ఆర్. కృష్ణయ్య కామెంట్స్....

రాష్ట్రంలో అదనంగా 50 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలి, పెండింగ్ ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలి. బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి, హాస్టల్ సీట్లు దొరకక బీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రైవేట్ హాస్టళ్ల ఫీజులు భరించలేక చదువు మానుకుంటున్న విద్యార్థులు, బీసీ హాస్టళ్లలో అదనంగా 20 శాతం సీట్లు పెంచాలి గురుకులాల్లో 10 శాతం సీట్లు అదనంగా పెంచాలి, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి గురుకులంలో సీటు ఇవ్వాలి, బీసీ గురుకులాలకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి సీట్లు లభించక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీసీ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE