Hyderabad: నవంబర్ 29న జరగాల్సిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి!

Hyderabad: నవంబర్ 29న జరగాల్సిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్‌కు బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం గౌడ్ వినతిపత్రం అందజేశారు.

HARISH, TARNAKA
Published on: 2 Nov 2026 5:46 PM IST
Hyderabad
X

Hyderabad: నవంబర్ 29న జరగాల్సిన ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి!

Hyderabad: నవంబర్ 29న నిర్వహించనున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ కోరారు. ఈ మేరకు సచివాలయంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

అదే రోజు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ (ఏఐబీఈ) కూడా ఉండటంతో రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏదో ఒక పరీక్షకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎస్‌ఐ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA