Malkajgiri: బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక.. సీపీ సుమతి!
Malkajgiri: సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ వద్ద సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మల్కాజిగిరి సీపీ సుమతి. బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి, స్త్రీమూర్తి గౌరవానికి ప్రతీక అని వెల్లడి.
Malkajgiri: బతుకమ్మ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక.. సీపీ సుమతి!
Malkajgiri: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ.. స్త్రీమూర్తికి మనం ఇచ్చే ప్రేమ, గౌరవం, గొప్పతనానికి ప్రతిరూపమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు.
మల్కాజిగిరి సఫిల్‌గూడ మినీ ట్యాంక్‌బండ్ వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. దుర్గాష్టమి రోజున శక్తిస్వరూపిణిగా కొలిచే అమ్మవారిని పూలలో శాంతమూర్తిగా ఆరాధించడం బతుకమ్మ ప్రత్యేకత అని పేర్కొన్నారు. స్త్రీమూర్తి గొప్పతనాన్ని, సమాజంలో మహిళలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ పండుగ ప్రపంచానికి చాటిచెబుతుందని తెలిపారు.
ప్రతి మహిళ, చిన్నారి సురక్షితంగా ఉండాలని, సమాజం ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సద్దుల బతుకమ్మ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన మున్సిపల్ శాఖకు, కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వేడుకలకు హాజరైన వారంతా సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా పోలీసుల ఆధ్వర్యంలో అవసరమైన పెట్రోలింగ్, భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.
మల్కాజిగిరి డిసిపి శ్రీధర్, పోలీస్ అధికారులు మున్సిపల్ శాఖ అధికారులు పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.




