Abdullapurmet: బాటసింగారం మార్కెట్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం!

Abdullapurmet: బాటసింగారం పండ్ల మార్కెట్‌లో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా జరిగింది. మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.

AJAY, HAYATH NAGAR
Published on: 17 Sept 2026 1:03 PM IST
Abdullapurmet
X

Abdullapurmet: బాటసింగారం మార్కెట్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం!

అబ్దుల్లాపూర్మెట్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో బాటసింగారం పండ్ల మార్కెట్ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యక్రమాలను వివరించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారికి నివాళులు అర్పించి, వారి సేవలను స్మరించుకున్నారు.

1948 సెప్టెంబర్ 17న రాచరిక పాలన ముగిసి తెలంగాణలో ప్రజాస్వామిక పాలనకు శ్రీకారం చుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్. భాస్కర చారి, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఎల్. శ్రీనివాస్, సభ్యులు మచ్చెందర్ రెడ్డి, నరసింహ, అంజయ్య, జైపాల్ రెడ్డి, బండి మధుసూదన్ రావు, గణేష్ నాయక్, రఘుపతి రెడ్డి, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీంతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR