Pocharam: పోచారంలో ఐటీ ఉద్యోగిని మౌనిక సంతోషి అనుమానాస్పద మృతి!

Pocharam: మేడ్చల్ జిల్లా పోచారంలో యాక్సిస్ బ్యాంక్ ఐటీ ఉద్యోగిని మౌనిక సంతోషి అనుమానాస్పద మృతి.. భర్త వేధింపుల ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు.

KARUNAKAR, UPPAL
Published on: 20 Sept 2026 2:11 PM IST
Pocharam
X

Pocharam: పోచారంలో ఐటీ ఉద్యోగిని మౌనిక సంతోషి అనుమానాస్పద మృతి!

Pocharam: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పోచారం ఐటీ కారిడార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గెలాక్సీ టవర్స్‌ అపార్ట్‌మెంట్‌లో యాక్సిస్‌ బ్యాంక్‌లో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్న మౌనిక సంతోషి (28) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకున్న స్థితిలో మృతిచెందింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనిక సంతోషి, వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి ఎనిమిదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవల మగ పిల్లలు ఉన్నారు.

రమాకాంత్‌ పోచారం ఇన్ఫోసిస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నారు. ఘటన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. తలుపులు తెరిచి ఉండటంతో పనిమనిషి వచ్చి చూడగా మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. వెంటనే నీలిమ ఆస్పత్రికి, అక్కడి నుంచి మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్యాభర్తల మధ్య ఉదయం జరిగిన గొడవలో భర్త వేధింపులే మృతికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై ఇంకా నిర్ధారణ కాలేదు.

పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనకు గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తల్లి మృతితో రెండున్నరేళ్ల కవల చిన్నారులు తల్లిని కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

KARUNAKAR, UPPAL

KARUNAKAR, UPPAL