Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో పొదుపు, పెట్టుబడులపై సదస్సు!

Hayathnagar: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొదుపు, పెట్టుబడులపై అవగాహన సదస్సు. విద్యార్థులకు మార్గదర్శనం చేసిన సెబీ ట్రైనర్ ముచ్చ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ సురేష్ బాబు.

AJAY, HAYATH NAGAR
Published on: 17 Sept 2026 6:16 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్ డిగ్రీ కళాశాలలో పొదుపు, పెట్టుబడులపై సదస్సు!

హయత్‌నగర్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బీఏ విద్యార్థులకు “పొదుపు మరియు పెట్టుబడులు” అంశంపై విస్తృత ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య వక్తగా SEBI సర్టిఫైడ్ మోటివేటర్, ట్రైనర్ శ్రీ ముచ్చ శ్రీనివాస్ రెడ్డి పాల్గొని పొదుపు, పెట్టుబడుల మార్గాలు, రిస్క్‌ను ఎదుర్కొనే విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ సంపాదనతో పాటు పొదుపు, సరైన పెట్టుబడి విధానాలపై అవగాహన అవసరమన్నారు. అర్థశాస్త్ర విభాగాధిపతి శ్రీమతి వి. ఇందిరా మాట్లాడుతూ అధిక లాభాల ఆశతో మోసపోవద్దని, చట్టబద్ధమైన పెట్టుబడి మార్గాలను మాత్రమే అనుసరించాలని సూచించారు. మోసపూరిత ఫోన్ కాల్స్, మొబైల్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అర్థశాస్త్ర అధ్యాపకులు శ్రీ షేక్ మహబూబ్, శ్రీమతి డి. రమాదేవి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR