Abdullapurmet: అవంతి కాలేజీలో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనం!
Abdullapurmet: హయత్ నగర్ అబ్దుల్లాపూర్మెట్ అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇస్రో, కలాం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం జరిపారు.
Abdullapurmet: అవంతి కాలేజీలో జాతీయ అంతరిక్ష దినోత్సవం ఘనం!
అబ్దుల్లాపూర్మెట్: అబ్దుల్లాపూర్మెట్ అవంతి ఇంజనీరింగ్ కాలేజ లో ఇస్రో, కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. చంద్రయాన్-3 విజయాన్ని స్మరించుకుంటూ విద్యార్థులకు భారత అంతరిక్ష సాంకేతికత, ఇస్రో విజయాలు, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించారు.
కలాం ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “స్పేస్ ఆన్ వీల్స్” డెమో వాహనంలో వివిధ లాంచ్ వెహికల్స్, చంద్రయాన్, మార్స్ మిషన్ తదితర అంతరిక్ష కార్యక్రమాల నమూనాలను విద్యార్థులకు ప్రదర్శించారు. సుమారు 20 మంది వాలంటీర్లు విద్యార్థులకు నమూనాలపై వివరాలు తెలియజేయగా, శాస్త్రవేత్తలు తమ అనుభవాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో నరేష్ ఇండియన్ మాట్లాడి అంతరిక్ష విజ్ఞానం, సాంకేతిక రంగంలోని అవకాశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల్లో అంతరిక్ష విజ్ఞానంపై ఆసక్తి పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమాన్ని విజయవంతం చేసిన, మేనేజ్‌మెంట్ ఫౌండర్ అవంతి శ్రీనివాస్, మేనేజింగ్ సభ్యులు, ఇస్రో మరియు కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ సభ్యులకు ముఖ్య అతిథిగా, కలాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకుడు నరేష్ ఇండియన్ గౌరవ అతిథిగా, NRSC–ISRO శాస్త్రవేత్త నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.




