Secunderabad: జేబీఎస్ వద్ద గ్రీన్ ఎస్ఎం క్యాబ్ లను రద్దు చేయాలని నిరసన!

Secunderabad: జేబీఎస్ వద్ద బీఎంఎస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు నిరసన తెలిపారు. గ్రీన్ ఎస్ఎం క్యాబ్ ల రాకతో ఉపాధి కోల్పోతున్నామని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Srikanth, Secunderabad
Published on: 14 Nov 2026 3:00 PM IST
Secunderabad
X

Secunderabad: జేబీఎస్ వద్ద గ్రీన్ ఎస్ఎం క్యాబ్ లను రద్దు చేయాలని నిరసన!

Secunderabad: మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని. మరోసారి గ్రీన్ ఎస్ఎం క్యాబ్ లతో ఆటో డ్రైవర్లు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జేబీఎస్ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లు బి ఎం ఎస్ యూనియన్ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇటీవల నగరంలో తిరుగుతున్న గ్రీన్ ఎస్ఎం క్యాబ్ ల రాకతో ఆటో లపై తీవ్ర ప్రభావం పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కిలోమీటర్ కు 9 రూపాయలతో గ్రీన్ ఎస్ఎం క్యాబ్ అందుబాటులోకి రావడంతో ఆటోలను ఆదరించడం లేదని ఆటో ఛార్జ్ కిలోమీటర్కు 8 రూపాయలు ఉందని కారును వదిలి ఆటోలో ఎవరైనా ఎక్కుతారంటూ వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. తమకు ఆటో చార్జీలు పెంచినట్లుగానే పెంచి వెనుక నుండి గ్రీన్ ఎస్ఎం ఆటోలను రంగంలోకి దింపారని ఆటో యూనియన్ నాయకులు మండిపడ్డారు.

వెంటనే గ్రీన్ ఎస్ఎం క్యాబ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 19న చలో ఢిల్లీ లో నిర్వహించే ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad