Shamshabad: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థి రక్షణ

Shamshabad: అత్తాపూర్‌లో ఆత్మహత్యకు యత్నించిన ఇంజనీరింగ్ విద్యార్థిని కాపాడిన పోలీసులు. ఫోన్ లొకేషన్ ట్రేస్ చేసి అడ్డుకున్న సీఐ సీతయ్య సిబ్బంది.

ANJAIAH, SHAMSHABAD
Updated on: 24 Sept 2026 10:36 PM IST
Shamshabad
X

Shamshabad: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఇంజనీరింగ్ విద్యార్థి రక్షణ

శంషాబాద్: ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యాయత్నం. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆత్మహత్య చేసుకోబోతున్న యువకుడిని కాపాడగలిగారు. గ్రేటర్ హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన.

తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన యువకుడు. విషయం తెలిసిన వెంటనే కంగారుపడిన స్నేహితుడు తక్షణమే పోలీసులకు సమాచారం అందించాడు

సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తి ఫోన్ లొకేషన్ ద్వారా ట్రేస్ చేసి ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు.

మహబూబ్నగర్ జిల్లాకు చెందిన భాను ప్రకాష్ అనే యువకుడు అత్తాపూర్ లో ఉంటూ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఈరోజు మధ్యాహ్నం తన స్నేహితుడికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ సమాచారం ఇచ్చాడు.

కంగారు పడిన స్నేహితుడు వెంటనే అత్తాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. విషయం తెలిసిన వెంటనే అత్తాపూర్ సిఐ సీతయ్య తన సిబ్బందిని అలర్ట్ చేయడంతో భాను ప్రకాష్ ను ఫోన్ లొకేషన్ ద్వారా గుర్తించి వెంటనే అతడిని రక్షించి పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.

అనంతరం ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేయగా కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించినట్లు భాను ప్రకాష్ తెలిపాడు. దీంతో భాను ప్రకాష్ కు ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించిన అత్తాపూర్ పోలీసులు.

ANJAIAH, SHAMSHABAD

ANJAIAH, SHAMSHABAD