OU: అస్మిత మహిళా సౌత్ జోన్ సైక్లింగ్‌కు సర్వం సిద్ధం!

OU: ఉస్మానియా యూనివర్సిటీ వెలోడ్రోమ్‌లో నవంబర్ 16, 17 తేదీల్లో అస్మిత ఖేలో ఇండియా సౌత్ జోన్ ట్రాక్ సైక్లింగ్ పోటీలు జరగనున్నట్లు పి. మల్లారెడ్డి వెల్లడించారు.

HARISH, TARNAKA
Published on: 11 Nov 2026 4:33 PM IST
OU
X

OU: అస్మిత మహిళా సౌత్ జోన్ సైక్లింగ్‌కు సర్వం సిద్ధం!

ఉస్మానియా యూనివర్సిటీ: తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ నెల 16, 17 తేదీల్లో అస్మిత మహిళా ఖేలో ఇండియా సౌత్ జోన్ ట్రాక్ సైక్లింగ్ పోటీలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు పి. మల్లారెడ్డి తెలిపారు.

ఈ పోటీల నిర్వహణపై సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా మహిళా క్రీడాకారిణులు, బాలికలు పాల్గొననున్నట్లు వెల్లడించారు. మహిళలు, జూనియర్ గర్ల్స్, సబ్ జూనియర్ బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతిభ కనబరిచి విజయం సాధించిన క్రీడాకారిణులకు నగదు బహుమతులతో పాటు పతకాలు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళలు, బాలికల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించి, సైక్లింగ్ క్రీడలో మరింత మంది ప్రతిభావంతులను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని వివరించారు.

ఈ సమావేశంలో రాష్ట్ర సైక్లింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి బి. విజయ్ కాంత్ రావు, అంతర్జాతీయ సైక్లిస్ట్ మ్యాక్స్‌వెల్ ట్రెవర్, మాజీ డిప్యూటీ డైరెక్టర్ చంద్రారెడ్డి, శాట్స్ కోచ్‌లు విజయభాస్కర్ రెడ్డి, పాండు జాదవ్, భువనగిరి జిల్లా కార్యదర్శి ధర్మతేజ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA