Meerpet: మీర్‌పేట్‌లో ఘనంగా అశోక్ సింఘాల్ శతజయంతి వేడుకలు!

Meerpet: హైదరాబాద్ మీర్‌పేట్‌లో విశ్వహిందూ పరిషత్ అగ్రనేత దివంగత అశోక్ సింఘాల్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

RAHUL, MEERPET
Published on: 4 Oct 2026 9:28 PM IST
Meerpet
X

Meerpet: మీర్‌పేట్‌లో ఘనంగా అశోక్ సింఘాల్ శతజయంతి వేడుకలు!

మీర్పేట్: మీర్పేట్ లోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో విశ్వహిందూ పరిషత్ అగ్రనేత దివంగత అశోక్ సింగల్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అశోక్ సింగల్ శత జయంతి వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ హిందూ సమాజ సంఘటితం కోసం మరియు ధార్మిక చైతన్యం కోసం అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో అశోక్ సింగల్ పోషించిన కీలక పాత్రను స్మరించుకున్నారు.

అలాగే విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో అశోక్ సింగల్ పాత్ర పోషించిన గురించి తెలిపారు. 25 లక్షల మందితో ప్రోగ్రాంను నిర్వహించడాన్ని కొనియాడారు. శ్రీరామ జన్మభూమి ఏర్పాటు చేయడంలో అశోక్ సింగల్ పాత్ర గణనీయమైందని అన్నారు. విశ్వ హిందూ పరిషత్ సాంస్కృతిక విషయంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. హిందు హిందు దేశ్ కి బంధు అని అన్నారు. అశోక్ సింగల్ లాంటి వారు దేశానికి ఆదర్శం అని తెలిపారు.

RAHUL, MEERPET

RAHUL, MEERPET