Lakdikapul: హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల భారీ ధర్నా!

Lakdikapul: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని లక్డీకాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్లు సోమవారం ధర్నా చేపట్టారు. డిసెంబర్ 15లోగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

GIRI, CENTRAL ZONE
Published on: 16 Nov 2026 2:59 PM IST
Lakdikapul
X

Lakdikapul: హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల భారీ ధర్నా!

Lakdikapul: ఆశల పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ... హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు తెలంగాణ ఆశా వర్కర్స్ రాష్ట్ర యూనియన్స్ ఆధ్వర్యంలో... లకిడికపుల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. రాష్టంలో ఆశా వర్కర్లు 28వేల మంది గత 20ఏళ్లుగా పని చేస్తున్నట్లు... తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు.

గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యో విధంగా చూస్తూ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. దింతో పాటు సీజనల్ వ్యాదులు, అంటువ్యాదులు, దీర్ఘకాలిక క వ్యాధులను అరికడడంతో పాటు... కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆశాలు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఇంత శ్రమచేస్తున్న ఆశాలకు నేటికీ రాష్టంలో ఫిక్స్డ్ వేతనం లేదని... కేవలం 9900లు మాత్రమే పారితోషికాలు చెల్లెస్తున్నారని తెలిపారు.

నిత్యావసర వస్తువుల ధరలు అకాశాన్నాంటు తున్నాయని... పని భారం పెరిగి వచ్చే పారితోషికాలు సరిపోక ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులు గురివుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని.. ఫిక్స్డ్ వేతనం 18వేలు నిర్ణయించాలని, ఈ ఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్లు... డిసెంబర్ 15లోగ పరిష్కరించాలని... నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE