AS Rao Nagar: మహేష్ నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
AS Rao Nagar: డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ మహేష్ నగర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా అడిషనల్ డీసీపీ వెంకటరమణ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
AS Rao Nagar: మహేష్ నగర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు!
ఏఎస్ రావునగర్: డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని మహేష్ నగర్ లో సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి అడిషనల్ డీసీపీ వెంకటరమణ ముఖ్య అతిథిగా హాజరై, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించిన మహిళలను అభినందించారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన మహిళలకు మహాలక్ష్మి జువెలర్స్ సౌజన్యంతో ప్రత్యేక బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ సామూహిక పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంతోపాటు ప్రజల్లో ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ ఎల్. భాస్కర్ రెడ్డి, ఎస్సై సతీష్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, యాదగిరి, వెంకట హరి, చంద్రారెడ్డి, సురేందర్, నర్సింగ్ రావు, వెంకటేష్, సత్యనారాయణ చారి, భాగ్య, శ్రీహరి, చంద్రకళ, విజయ తదితరులు పాల్గొన్నారు.




