Hyderabad: 152 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల హిప్పోక్రటిక్ ప్రమాణం!
Hyderabad: హైదరాబాద్ రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అపోలో మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో 2026 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్ కోట్ వేడుక, హిప్పోక్రటిక్ ప్రమాణ స్వీకారం జరిగింది.
Hyderabad: 152 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల హిప్పోక్రటిక్ ప్రమాణం!
హైదరాబాద్: హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ ఆధ్వర్యంలో వైట్ కోట్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2026 బ్యాచ్‌కు చెందిన 152 మంది ప్రథమ సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులకు వైట్ కోట్స్ అందజేసి, వైద్య నైతిక విలువలు, రోగుల సంరక్షణకు కట్టుబడి ఉంటామని హిప్పోక్రటిక్ ప్రమాణం చేయించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ కే. సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో పరిజ్ఞానంతో పాటు కరుణ, సానుభూతి, నైతిక విలువలు ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. డీన్ డాక్టర్ కే. మనోహర్ విద్యార్థులు చిత్తశుద్ధి, సేవ, త్యాగం అనే మూడు సూత్రాలను జీవితాంతం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఓఓ ఎంఎస్ అపర్ణారెడ్డి, డాక్టర్ నీతా కుందూర్, డాక్టర్ డీ. నాగేందర్, డాక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




