Hyderabad: నవంబర్ 2న హైదరాబాద్కు అమిత్ షా రాక.. అధికారిక షెడ్యూల్ ఖరారు
Hyderabad: నవంబర్ 2న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది; 'లోక్తంత్ర బచావో.. అరాచకత్వ హటావో' పాదయాత్రలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Hyderabad: నవంబర్ 2న హైదరాబాద్కు అమిత్ షా రాక.. అధికారిక షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ఎల్లుండి హైదరాబాద్ కు అమిత్ షా రాక. నవంబర్ 2న అమిత్ షా అధికారిక షెడ్యూల్. మ. 2 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్ షా, బేగంపేట నుంచి కాకతీయ హోటల్ చేరుకొని 4 గంటల వరకు కాకతీయ హోటల్ లో బస చేయనున్న కేంద్ర మంత్రి. దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియపై కాంగ్రెస్, సీజేపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాటిని తిప్పికొట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగిన అమిత్ షా.
సా.4 తర్వాత నేరుగా బాబు జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు "లోక్ తంత్ర బచావో - అరాచకత్వ హటావో " పేరుతో తలపెట్టిన పాదయాత్రలో పాల్గొననున్న అమిత్ షా, సా. 5 గంటల నుంచి 5.30 వరకు ఎంజే మార్కెట్ వద్ద ప్రజలనుద్దేశించి మాట్లాడనున్న అమిత్ షా, అనంతరం 6గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయల్దేరనున్న అమిత్ షా.
మ.. 2 గంటల నుంచి 4గంటల వరకు ఉన్న రిజర్వ్ షెడ్యూల్ లో రాష్ట్రంలోని వివిధ రంగ ప్రముఖలను కలిసే అవకాశం. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షా చర్చించే అవకాశం.




