Amberpet: ఘనంగా బొడ్రాయి నాభిశిల మూడవ వార్షికోత్సవ పూజలు

Amberpet: అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి ఆధ్వర్యంలో బొడ్రాయి నాభిశిల మూడవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

GIRI, CENTRAL ZONE
Published on: 15 Nov 2026 7:07 PM IST
Amberpet
X

Amberpet: ఘనంగా బొడ్రాయి నాభిశిల మూడవ వార్షికోత్సవ పూజలు

అంబర్‌పేట: అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో బొడ్రాయి నాభిశిల మూడవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్రాయికి ప్రత్యేక అలంకరణ చేసి, జ్యోతి ప్రజ్వలనతో పూజా కార్యక్రమాలను ప్రారంభించారు.

అనంతరం అఖండ జ్యోతుల కార్యక్రమం, చంద్రపటంపై నవధాన్యాలతో ప్రత్యేక పూజలు, దిష్టి కుంభం, బొడ్రాయి చుట్టూ పొత్తు పోయడం,మంగళహారతులతో పూజా కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బొడ్రాయి నాభిశిలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

గ్రామ, ప్రాంత సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించడంతో పాటు, ప్రజల మధ్య ఐక్యత, భక్తిభావం పెంపొందించడంలో ఇటువంటి వార్షికోత్సవ కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోలుపునూరి కృష్ణగౌడ్, పద్మావతి డిపి రెడ్డి పుల్ల నారాయణస్వామి చింతల శ్రీనివాస్ ముదిరాజ్, సత్తిబాబు గౌడ్ కేంచే చంద్రశేఖర్, దిలీప్ నేత తోలుపునూరి మోనిష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేవస్థాన కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించి భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. భక్తుల సందడి, పూజా కార్యక్రమాలతో అంబర్‌పేటలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE