Amangal: రైతుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై గీత ఆచారి ఆగ్రహం!

Amangal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ సాకిబండ తండాలో రైతుల భూముల నుంచి అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న వ్యవహారాన్ని వైస్ చైర్‌పర్సన్ గీత ఆచారి అడ్డుకున్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 17 Nov 2026 10:14 AM IST
Amangal
X

Amangal: రైతుల భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలపై గీత ఆచారి ఆగ్రహం!

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని సాకిబండ తండాలో రైతుల భూముల నుంచి అనుమతులు లేకుండా మట్టి తవ్వి తరలిస్తున్న వ్యవహారాన్ని మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గీత ఆచారి అడ్డుకున్నారు. మూడో వార్డులోని 201 సర్వే నంబర్‌లో రైతుల అనుమతి లేకుండానే స్వామి కన్స్ట్రక్షన్స్ యాజమాన్యం మట్టి తవ్వి ఏఎల్‌ఎంటీ సంస్థకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గీత ఆచారి మట్టి తవ్వకాలను నిలిపివేయాలని సంబంధిత యాజమాన్యాన్ని ఆదేశించారు. రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండా మట్టిని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించినప్పటికీ స్పందన లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

అదేవిధంగా మూడో వార్డు పరిధిలోని అటవీ ప్రాంతం, ధర్మకంట సమీపంలో అనుమతులు లేకుండా చేపడుతున్న నిర్మాణాలపై కూడా ఆమె ఆరా తీశారు. అక్రమ నిర్మాణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరారు.

ఈ సందర్భంగా గీత ఆచారి మాట్లాడుతూ.. రైతుల భూములు, హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదని, రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఎవరైనా రైతులను బెదిరించినా, ఇబ్బందులకు గురిచేసినా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నరసింహ, కౌన్సిలర్ సునీత, కర్నాటి విక్రమ్ రెడ్డి, రమేష్ నాయక్, రవి రాథోడ్, ప్రశాంత్ నాయక్, రైతులు లాల్ సింగ్ నాయక్, బిచ్చ నాయక్, గోపి నాయక్, శ్రీను నాయక్, రాజేందర్, బాలు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY