Amangal: ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి తుమ్మల

Amangal: ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి తుమ్మల సూచన. ఆమనగల్‌లో పాల్గొన్న మార్కెట్ చైర్మన్ యాట గీత.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 Oct 2026 4:22 PM IST
Amangal
X

Amangal: ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ పంటలు వేయాలి తుమ్మల

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల రైతు వేదికలో ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.

ఈ మేరకు గురువారం మండల పరిధిలోని రాంనుంతల రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి వ్యవసాయ రంగ పరిస్థితులు, రైతులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. తక్కువ కాలపరిమితి కలిగిన పంటలతో పాటు కంది, పెసర, జొన్న వంటి తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.

భూసార పరిరక్షణ, నేల ఆరోగ్యం, పంటల సంరక్షణ, నీటి పొదుపు పద్ధతులపై ‘ఖేత్ బచావో అభియాన్’ ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. పత్తి కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, తేమ శాతం నియంత్రిస్తూ మలినాలు లేని నాణ్యమైన పత్తిని మార్కెట్‌కు తీసుకురావాలని రైతులకు సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మార్కెట్ చైర్మన్ యాట గీత నరసింహ ముదిరాజ్ మాట్లాడుతూ, వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ పంట నష్టాలను తగ్గించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, ఏఈఓలు మీనాక్షి, నికిత, వినోద్, రైతులు, దేవర శెట్టి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY