Amanagallu: ఆమనగల్లులో రౌడీషీటర్లకు సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్!

Amanagallu: ఆమనగల్లులో రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్. దసరా వేడుకల్లో అప్రమత్తంగా ఉండాలి, పాలపిట్టను బంధిస్తే చర్యలు తప్పవని సీఐ వెంకటేశ్వర్లు హెచ్చరిక!

SRI SAILAM, KALWAKURTHY
Published on: 18 Oct 2026 3:33 PM IST
Amanagallu
X

Amanagallu: ఆమనగల్లులో రౌడీషీటర్లకు సీఐ వెంకటేశ్వర్లు కౌన్సెలింగ్!

Amanagallu: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండల కేంద్రంలో ::-దసరా పండుగ సందర్భంగా పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆమనగల్లు పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆదివారం పోలీస్‌ స్టేషన్‌కు రౌడీషీటర్లను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారి ప్రస్తుత కార్యకలాపాలు, వృత్తి, ఉపాధి వివరాలను పరిశీలించి, సత్ప్రవర్తనతో మెలగాలని, నేరాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

దసరా పండుగను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని పోలీసులు సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో గొడవలు, అల్లర్లు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY