Amanagallu: ఆమనగల్లు సింగల్ విండో కార్యవర్గ సమావేశం!

Amanagallu: ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సమావేశం పంట రుణాలు, ఎరువుల పంపిణీ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ వెంకటేష్ గుప్తా పిలుపు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 28 Sept 2026 5:08 PM IST
Amanagallu
X

Amanagallu: ఆమనగల్లు సింగల్ విండో కార్యవర్గ సమావేశం!

ఆమనగల్లు: ఆమనగల్లు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగల్ విండో) కార్యవర్గ సమావేశం సోమవారం నిర్వహించారు. సంఘం చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా మాట్లాడుతూ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు అందిస్తున్న పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల పంపిణీ వంటి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు ఏ ఇబ్బంది కలిగినా సంఘం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని, రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు.

అలాగే రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకుని లబ్ది పొందాలని సూచించారు. సంఘం అభివృద్ధికి, పారదర్శక పాలనకు కార్యవర్గ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సింగల్ విండో వైస్ చైర్మన్ డి సత్యం, డైరెక్టర్లు ఎనుముల జంగమ్మ, చేగురి వెంకటేష్, వెంకటయ్య, జోగు వీరయ్య, శ్రీపాల్, సీఈవో పద్మాకర్ రెడ్డి, అల్లాజీ, దేవేందర్, మహేష్, సురేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY