Amanagallu: ఆమనగల్లు ప్రగతికి మరిన్ని నిధులు తెస్తాం: పత్య నాయక్
Amanagallu: ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో ఆమనగల్లు అభివృద్ధికి మరిన్ని నిధులు తెస్తామని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ స్పష్టం చేశారు.
Amanagallu: ఆమనగల్లు ప్రగతికి మరిన్ని నిధులు తెస్తాం: పత్య నాయక్
రంగారెడ్డి జిల్లా: ఆమనగలు మున్సిపాలిటీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్లు మున్సిపాలిటీ దినదినాభివృద్ధి చెందుతోందని మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ అన్నారు.
ఆమనగల్లులో అదనపు సివిల్ కోర్టు మంజూరు కావడం హర్షణీయమని పేర్కొన్నారు. అదనపు సివిల్ కోర్టు అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన కక్షిదారులకు ప్రయాణ భారం, సమయం తగ్గడంతో పాటు ఆమనగల్లులో వ్యాపార కార్యకలాపాలు కూడా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.
సుమారు వారం రోజుల క్రితం పట్టణ అభివృద్ధి పనుల కోసం రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ప్రస్తుతం పలు ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
రాబోయే రోజుల్లో ఆమనగల్లుకు మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు తీసుకురావడంతో పాటు పట్టణ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు సాధిస్తామని పత్య నాయక్ అన్నారు.
ప్రజల సహకారంతో ఆమనగల్లు మున్సిపాలిటీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మానయ్య, పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, శివలింగం, కో-ఆపరేటివ్ ఖాదర్, ఏఎంసీ డైరెక్టర్ శ్రీశైలం, ధోనికుమార్, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.




