Amanagallu: పీఏసీఎస్‌లలో నామినేటెడ్ వద్దు.. ప్రత్యక్ష ఎన్నికలే ముద్దు

Amanagallu: పీఏసీఎస్‌లకు నామినేటెడ్ పాలకవర్గాల నియామకంపై బిఆర్ఎస్ మండిపాటు. ఆమనగల్‌లో రైతు హక్కుల కోసం న్యాయపోరాటం చేస్తామని దుడ్డు ఆంజనేయులు యాదవ్ హెచ్చరిక.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 7 Nov 2026 6:58 PM IST
Amanagallu
X

Amanagallu: పీఏసీఎస్‌లలో నామినేటెడ్ వద్దు.. ప్రత్యక్ష ఎన్నికలే ముద్దు

ఆమనగల్: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం కల్పించిన రైతుల హక్కులను హరించేందుకు విఫలయత్నం చేస్తుందని అందుకు నిదర్శనమే ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల ద్వారా పాలకమండలీని ఎన్నుకోక కేవలం ఒక్క జీవో తో నామినేటెడ్ పాలకవర్గాన్ని ఎంపిక చేయడంపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్ దుడ్డు ఆంజనేయులు, బిఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత రాజ్యాంగం అమలు లోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికల ద్వారానే పాలకవర్గాన్ని ఎన్నిక చేయడం జరుగుతుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) నామినేటెడ్ పద్ధతిలో పాలకవర్గ కమిటీని నియమించడం ప్రజాస్వామ్యా దేశంలో రైతుల హక్కులను లాక్కోవాలని చూడడం కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

పీఏసీఎస్ లు గ్రామీణ ప్రాంత రైతులకు వెన్నుముక్క లాంటివని అలాంటి ప్రాథమిక సహకార సంఘాలను తీసివేయడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటకాలు ఆడుతుందని ఆరోపించారు. మండలాల్లో పిఎసిఎస్ ల ఆధ్వర్యంలో రైతులకు. విత్తనాలు, ఎరువులు, రుణాలు అన్నీ ఇక్కడి నుంచే వస్తాయి.

ఇంతటి కీలకమైన సంస్థలకు రైతుల ఓటు హక్కుతో ఎన్నుకునే అవకాశం లేకుండా నామినేటెడ్ పద్ధతి పెట్టడం అంటే రైతు వ్యతిరేక నిర్ణయమే అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై రైతులు వ్యతిరేకంగా ఉన్నారనే అక్కసుతో పీఏసీఎస్ లకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ధైర్యం, దమ్ము ప్రభుత్వానికి లేదు.

అందుకే తాత్కాలికంగా ఆరు నెలలపాటు కొత్త కమిటీలకు అవకాశం ఇస్తున్నామని చేతులు దులుపుకుంటోంది. ఆరు నెలల తర్వాత మళ్లీ పొడిగిస్తారా? ఇది రైతులను మోసం చేయడమే అని ఆయన దుయ్యబట్టారు. పారదర్శకంగా ఎన్నికలు పెట్టి రైతులు ఎవరిని కోరుకుంటారో వారికే అవకాశం ఇవ్వాలి. నామినేటెడ్ పద్ధతి వల్ల అవినీతికి, పక్షపాతానికి ఆస్కారం ఉంటుందని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ డిమాండ్లు:

1. పీఏసీఎస్ లకు వెంటనే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలి

2. నామినేటెడ్ కమిటీల నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేయాలి

3. రైతుల ఆమోదంతోనే పీఏసీఎస్ కమిటీలు ఉండాలి

ప్రభుత్వం ఈ తొందరపాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బిఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దుడ్డు ఆంజనేయులు యాదవ్, నాగిళ్ల జగన్, సీనియర్ నాయకులు సయ్యద్ ఖలీల్, వస్పుల సాయిలు, సైదులు గౌడ్, పుల్లారెడ్డి, శ్రీశైలం తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY