Shettipally: శెట్టిపల్లిలో ఘనంగా శైలపుత్రి దేవి పూజలు

Shettipally: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం శెట్టిపల్లిలో దేవీ నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దేవికి సర్పంచ్, ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు జరిగాయి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Oct 2026 3:57 PM IST
Shettipally
X

Shettipally: శెట్టిపల్లిలో ఘనంగా శైలపుత్రి దేవి పూజలు

శెట్టిపల్లి: గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ పూజా కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తెల్గమల్ల జంగమ్మ–వెంకటయ్య, ఉపసర్పంచ్ బాలగొని కృష్ణ ప్రసాద్, వార్డు సభ్యుడు టి. రాములు, గ్రామ పెద్దలు మాడుగుల రాములు గౌడ్, పొనుగోటి యాదగిరిరావు, మేరే లక్ష్మయ్యతో పాటు యువకులు బొడ్డు అభిలాష్, లోకేష్, మణి, బాబీ, అరవింద్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, శైలపుత్రి దేవి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY