Amanagal: పోలీస్ అమరవీరుల సంస్మరణ వేళ అమనగల్‌లో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం

Amanagal: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమనగల్ బస్టాండ్‌లో మెగా ఆరోగ్య శిబిరం. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాథ్య నాయక్, సీఐ వెంకటేశ్వర్లు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Oct 2026 4:26 PM IST
Amanagal
X

Amanagal: పోలీస్ అమరవీరుల సంస్మరణ వేళ అమనగల్‌లో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం

అమనగల్: రంగారెడ్డి జిల్లా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే వీక్–2026 సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమనగల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో అమనగల్ బస్టాండ్‌లో మెగా ఆరోగ్య అవగాహన శిబిరాన్ని నిర్వహించారు.

Rxpert Super Speciality e-Clinics సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన జీవనశైలికి సంబంధించిన పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అమనగల్ మున్సిపల్ చైర్మన్ డా. పాథ్య నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

అమనగల్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సంతోష్ కుమార్, ఏఎస్ఐ రామ్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, యువత, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు పోలీసులకు, ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY