Alwal: అల్వాల్లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు!
Alwal: అల్వాల్ జానకీ నగర్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడి నుంచి 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు.
Alwal: అల్వాల్లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు!
అల్వాల్: అల్వాల్ పోలిస్టేషన్ పరిధి జానకీ నగర్ లో గత శనివారం రాత్రి జరిగిన దొంగతనం కేసును పోలీసులు చేధించారు. ఇంట్లో వారు సాయంత్రం దమ్మాయి గూడలోని బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో చోరీ జరిగినట్లు 100/112 కు ఫిర్యాదు చేశారని అల్వాల్ ఎసిపి రమేష్ తెలిపారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అల్వాల్ పోలీసులు అల్వాల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించామన్నారు.
నేహెమయ్య అలియాస్ బ్రూస్లీ అనే నిందితుడు, మరో నిందితుడు నితిన్ ఫ్రాన్సిస్ తో కలిసి చోరికి పాల్పడినట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించినట్లు ఎసిపి రమేష్ తెలిపారు. చోరికి గురైన 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి ఆభరణాలను రెండవ నిందితుడు నితిన్ ఫ్రాన్సిస్ వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎసిపి తెలిపారు.
ఫ్రాన్సిస్ ను బేగంపేట్ లోని బాలమ్ రాయ్ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకోగా ప్రధాన నిందితుడు దార్ల నెహెమయ్య ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు ఎసిపి వివరించారు. నిందితులను గుర్తించడం, చోరికి గురైన సొత్తును పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అల్వాల్ పోలీసులను ఎసిపి అభినందించారు.




