Kapra: కాప్రా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: శ్రీధర్‌బాబుకు వినతి

Kapra: కాప్రా పరిధిలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు కాప్రా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.

ASHOK, KAPRA
Published on: 6 Nov 2026 6:16 PM IST
Kapra
X

Kapra: కాప్రా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి: శ్రీధర్‌బాబుకు వినతి

కాప్రా: కాప్రా పరిధిలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ కాప్రా ప్రెస్ క్లబ్ ప్రతినిధులు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చర్లపల్లిలో ప్రొఫెసర్ జయశంకర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరైన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ల సమక్షంలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలుస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ, చాలామంది జర్నలిస్టులకు సొంత ఇళ్లు లేకపోవడంతో పరిమిత ఆదాయంతో అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

జర్నలిస్టుల సేవలను గుర్తించి, వారి చిరకాల స్వప్నమైన సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. కాప్రా ప్రాంత జర్నలిస్టుల సుదీర్ఘకాల నిరీక్షణకు ముగింపు పలికేలా అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మెరుగు చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి ముత్యం ముఖేష్ గౌడ్, కోశాధికారి వెంకట యోగి రామచంద్ర మూర్తి, ముఖ్య సలహాదారులు బేలిదే అశోక్ గుప్తా, సీనియర్ జర్నలిస్టు పలుగుల పవన్, క్లబ్ ఉపాధ్యక్షులు యావాపురం రవి, వెంకట్, శనిగరం అశోక్, గాదె రాము, రమేష్, అమరేందర్, భవాని శంకర్, చుక్కా రమేష్, నిరంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA