Rangareddy: రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఎస్‌ఐఆర్ అక్రమాలపై అఖిలపక్షం భారీ నిరసన!

Rangareddy: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్‌ఐఆర్ అక్రమాలను నిరసిస్తూ నేడు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ వెల్లడి.

B SHETTAIAH GOUD, LB NAGAR
Published on: 6 Oct 2026 8:22 AM IST
Rangareddy
X

Rangareddy: రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఎస్‌ఐఆర్ అక్రమాలపై అఖిలపక్షం భారీ నిరసన!

Rangareddy: SIR ప్రక్రియలో జరిగిన అక్రమాలను నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద భారీ నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ తెలిపారు. ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఏఐసీసీ, ఇండియా కూటమి పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ, అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నేడు ఉదయం 10 గంటలకు కొంగర కలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన మార్చ్ ప్రారంభం కానుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం పోరాడుతున్నట్లు మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

B SHETTAIAH GOUD, LB NAGAR

B SHETTAIAH GOUD, LB NAGAR