Hayathnagar: హయత్‌నగర్ జూనియర్ కళాశాల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి!

Hayathnagar: హయత్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి ఏఐఎస్‌ఎఫ్ నాయకులు వినతిపత్రం అందజేశారు.

AJAY, HAYATH NAGAR
Published on: 4 Oct 2026 2:33 PM IST
Hayathnagar
X

Hayathnagar: హయత్‌నగర్ జూనియర్ కళాశాల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి!

హయత్‌నగర్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్ హయత్‌నగర్ మండల సమితి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

కళాశాలలో తాగునీటి సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బాలికల మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, కళాశాల సమీపంలో ఆకతాయిల బెడద కారణంగా విద్యార్థినులు భద్రతపై ఆందోళన చెందుతున్నారని తెలిపారు. తక్షణమే తాగునీటి వసతి కల్పించడంతో పాటు మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టి విద్యార్థినులకు భద్రత కల్పించాలని కోరారు.

విద్యార్థుల సమస్యలను విన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సానుకూలంగా స్పందించి, వీలైనంత త్వరగా తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టి విద్యార్థినులకు భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఏఐఎస్‌ఎఫ్ నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ హయత్‌నగర్ మండల కార్యదర్శి బొంగు అరుణ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఈనపల్లి ఉపేందర్, సంయుక్త కార్యదర్శి జూనోతల భాను ప్రకాష్, జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

AJAY, HAYATH NAGAR

AJAY, HAYATH NAGAR