Amanagallu: యువతకు ఉద్యోగ భరోసా.. ప్రజారోగ్యానికి పెద్దపీట!

Amanagallu: ఆమనగల్లులో అక్టోబర్ 13న ఐక్యత ఫౌండేషన్ 25వ జాబ్ డ్రైవ్ జరగనుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నట్లు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Oct 2026 9:29 PM IST
Amanagallu
X

Amanagallu: యువతకు ఉద్యోగ భరోసా.. ప్రజారోగ్యానికి పెద్దపీట!

ఆమనగల్లు: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, మహిళల ఆర్థిక స్వావలంబన, ప్రజారోగ్య పరిరక్షణే ఐక్యత ఫౌండేషన్ లక్ష్యమని ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆరు మండలాల మీడియా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఫౌండేషన్ కార్యక్రమాలను వివరించారు.

ఈ నెల 13న మంగళవారం ఆమనగల్లులో 25వ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అర్హతలతో 18 నుంచి 35 సంవత్సరాల వయస్సున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యోగాల ఎంపికలో పారదర్శకతకు ప్రాధాన్యతనిస్తూ, అభ్యర్థులకు నిజమైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే, ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ జలధార కార్యక్రమం తలకొండపల్లి, వెల్దండ మండలాల్లోని 63 గ్రామ పంచాయతీల పరిధిలో 134 గ్రామాల్లో పూర్తయిందని వెల్లడించారు. ప్రత్యేక యంత్రాలతో గ్రామాల్లోని నీటి ట్యాంకులను శుభ్రపరిచి ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో కల్వకుర్తి మండలంలో మూడో విడత స్వచ్ఛ జలధార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, చంద్రశేఖర్, కొండల్, తల్లోజు రఘు, కాలే మహేష్, శ్రీపతి, శేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY