Amanagal: ఎండిన పంట పొలాల సర్వేను పరిశీలించిన వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్
Amanagal: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలంలో ఎండిన పంటల సర్వేను వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించి, రైతులు నష్ట వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.
Amanagal: ఎండిన పంట పొలాల సర్వేను పరిశీలించిన వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్
రంగారెడ్డి జిల్లా: ఆమనగల్ మండలం పరిధిలో ఎండిన పంట పొలాల సర్వే ప్రక్రియను వ్యవసాయ శాఖ అధికారులు ముమ్మరం చేశారు. సోమవారం వ్యవసాయ అధికారి శ్రీనివాస్ గౌడ్ షెడ్యూల్ ప్రకారం కోనాపూర్, శెట్టిపల్లి, పోలేపల్లి గ్రామాల్లో పర్యటించి ఎండిన పంట పొలాల సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రైతులు తమ గ్రామాల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులకు తమ ఎండిన పంట పొలాలను ప్రత్యక్షంగా చూపించి, పంట నష్టానికి సంబంధించిన విస్తీర్ణ వివరాలను నమోదు చేయించుకోవాలని కోరారు. సర్వే సమయంలో రైతులు సహకరించి సరైన వివరాలు అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శెట్టిపల్లి సర్పంచ్ జంగమ్మ వెంకటయ్య , కోనాపూర్ సర్పంచ్ శ్రీలత వ్యవసాయ విస్తరణ అధికారులు భూదేవి, మీనాక్షి, ప్రభావతి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.




