Shabad: మన్ మర్రి గ్రామంలో రైతులకు 'ఖేత్ బచావో అభియాన్' పై అవగాహన సదస్సు!
Shabad: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మన్ మర్రి గ్రామంలో భూసార పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం, ఎల్ నినో పరిస్థితులపై రైతులకు 'ఖేత్ బచావో అభియాన్' అవగాహన కార్యక్రమం.
Shabad: మన్ మర్రి గ్రామంలో రైతులకు 'ఖేత్ బచావో అభియాన్' పై అవగాహన సదస్సు!
Shabad: షాబాద్ మండలం మన్ మర్రి గ్రామంలో ఈ రోజు రైతులకు నేల ఆరోగ్య పరిరక్షణ, భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర మాట్లాడుతూ రైతులకు భూసార పరిరక్షణ, భూసార పరీక్షల ప్రాముఖ్యత, భూసార ఆరోగ్య కార్డుల ఆధారంగా సమతుల్య ఎరువుల వినియోగం, సేంద్రియ ఎరువుల ప్రాధాన్యత, పంట అవశేషాల నిర్వహణ, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, నీటి సంరక్షణ, పంటల వైవిధ్యీకరణ, స్థిరమైన పోషక యాజమాన్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలను వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయ పద్ధతుల అమలుపై అవగాహన కల్పించడం జరిగినది.
ఎల్ నినో నేపథ్యంలో ఈ యాసంగిలో వరికి బదులుగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రైతులు అవసరానికి మించి రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా, భూసార పరీక్షల ఆధారంగా సిఫారసు చేసిన మోతాదుల్లోనే వినియోగించాలని సూచించారు.
పంట అవశేషాలను కాల్చకుండా నేలలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంపొందించే విధంగా తగిన నిర్వహణ చర్యలు చేపట్టాలి. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, పంటల సాగులో సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకొని, నేల సారాన్ని కాపాడుకుంటూ దీర్ఘకాలికంగా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలియజేయడమైనది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ లాలాపేట బందయ్య, ఉపసర్పంచ్ బేగరి శంకరయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి మౌనిక, రైతులు సురేష్ గౌడ్, విజయ్ కుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నవ్వత్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి, శంకరయ్య, నర్సింహులు గౌడ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. భూసార పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరవేత లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.




