Rangareddy: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
Rangareddy: రాజేంద్రనగర్ సర్కిల్ బుద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, DMHO కళ్యాణ్ చక్రవర్తి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు.
Rangareddy: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి!
Rangareddy: పోలియో రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి పిలుపునిచ్చారు. చిన్నారుల భవిష్యత్తును కాపాడేందుకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బుద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో టీకాలు వేయించాలని అధికారులు సూచించారు.
పోలియో వ్యాధి బారిన పడకుండా చిన్నారులను రక్షించడంలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




